Great Indian Sports War 2022-23 Puma vs Adidas vs Nike

భారత్ లో టాప్ బ్రాండ్ గా పుమా(Puma)

Great Indian Sports War 2022-23 Puma vs Adidas vs Nike


హలో ఫ్రెండ్స్ instantemo కీ మీకు స్వాగతం. ముఖ్యంగా ఈ రోజు భారత్ లొనే టాప్ బ్రాండ్ గా ఉన్న పుమా కంపెనీ గురించి మీకు తెలియజేయాలని ఎంతో ఉత్సాహంగా ఉన్నా. ఇక ఆలస్యం చేయకుండా టాపిక్ లోకి వెళ్దాం.



Adidas, Puma, Nike, Reebook, Virat Kohli, Sachin Tendulkar, Dhoni,
Puma vs Adidas vs Nike


ముఖ్యంగా ఈ పూమా కంపెనీ కి ఎప్పుడైతే మన భారత క్రికెటర్ విరాట్ కోహ్లి పూమ కంపెనీ కి అంబాసడర్ గా చేయడం మొదలు పెట్టాడో అప్పటినుండి పుమా ఇంకా టాప్ లోకి వచ్చింది.


 సచిన్ టెండూల్కర్ అంబాసడర్ గా చేస్తున్న అడిడాస్ కంపెనీని కూడా దాటిపోయింది. 2016 లో 8వ స్థానంలో ఉన్న పుమా 2018 నాటికి  ఐదో స్థానంలో ఉంది మనం చూసుకుంటే పుమా భారత్ మార్కెట్ లో భవిష్యత్ లో ఇంకా పై స్థానంలో ఉండబోతుంది.


పుమా 2021లో దాదాపుగా 680 కోట్లు అమ్మకాలు చేయగా 2022 సంవత్సరంలో ఇంకా 14% ఎక్కువగా అమ్మకాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. నైక్, అడిడాస్ ఇతర దేశాల్లో ఎక్కువగా అమ్మకాలు చేస్తుంటే పుమా మాత్రం మన భారత దేశంలో టాప్ స్పోర్ట్స్ వేర్ బ్రాండ్ గా ఉంది.


మహిళలు ఎక్కువగా ఈ పుమా కంపెనీ ప్రొడక్ట్స్ ని వాడుతున్నారు. ఈ మధ్యనే హర్డ్డి సందు పుమా కి బ్రాండ్ అంబాసిడర్ గా నియమితులయ్యారు. పుమా తో పాటు అమెరికాకు స్కేచర్స్ బ్రాండ్ మాత్రమే 2020 లో అమ్మకాలలో ఎక్కువ పెరుగుదల కనబరిచింది.


 అడిడాస్ అమ్మకాలు 2019-20 లో దాదాపుగా రూ 1700 కోట్లు ఉండగా 2020 -21 నాటికి రూ 2.475 కోట్లు నమొదయాయి. అదే సమయంలో అడిడాస్ కి చెందిన రిబోక్ అమ్మకాలు మాత్రం రూ. 527 కోట్ల నుంచి రూ. 316 కోట్లకు పడిపోయాయి.


పుమా కంపెనీ పాటించే ఎవరికి తెలియని కొన్ని సీక్రెట్స్


ముఖ్యంగా కంపెనీ, బిజినెస్ లేదా స్టాక్ మార్కెట్ ఏదైనా డబ్బు విషయానికి వచ్చినప్పుడు అందరికంటే కొంచెం వ్యత్యసంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే వాళ్ళే మంచి స్థానంలో ఉంటారు. అదే విధంగా ఈ పుమా కంపెనీ కొన్ని సీక్రెట్స్ పాటిస్తుంది.

• నైక్, రీబోక్, అడిడాస్ కంపెనీ లు మార్చి - ఏప్రిల్ క్యాలెండర్ ఫాలో అవుతుండగా పుమా మాత్రం జనవరి - డిసెంబర్ క్యాలెండర్ ఫాలో అవుతుంది.

• అన్ని కంపెనీలు టెక్నాలజీ మీద దృష్టిపెడితే పుమా మాత్రం స్టైలిష్ మీద ఎక్కువ దృష్టి పెట్టింది.

• ఫ్యాషన్ లో భాగంగా షూస్, దుస్తులు మరియు ఇంకా అనేక రకాల వాటిలో స్టైలిష్ గా తయారు చేయడం జరిగింది.

• ఎక్కువ ప్రజలు ఏమి కోరుకుంటున్నారో, వేటి కోసం సెర్చ్ చేస్తున్నారో వాటి మీద ఫోకస్ పెట్టడం జరిగింది.


పుమా స్టాక్ మార్కెట్ లో ఇన్వెష్ట్ చేయడం వల్ల లాభమా నష్టమా ?


చాలా మందికి ప్రశ్నలు లేదా సందేహాలు ఉండొచ్చు పుమా స్టాక్ లో ఇన్వెష్ట్ చేస్తే లాభాలు ఉంటాయ అని.

స్టాక్ లో ఇన్వెష్ట్ చేసేవారు తెలుసుకోవలసిన విషయాలు:


• ఫండమెంటల్ అనాలిసిస్

• కంపెనీ యొక్క అమ్మకాలు ఎలా ఉన్నాయి

• బ్యాలెన్సింగ్ క్యాపిటల్ ఎలా ఉంది

• గ్లోబల్ లో ర్యాంకింగ్ ఎలా ఉంది

• క్యాష్ ఫ్లో ఎలా ఉంది

• డైలీ పేమెంట్స్ వస్తున్నాయా లేదా

• షేర్ ప్రైస్ ఎలా ఉంది


ఈ విధంగా ఇంకా ఎన్నో కొన్ని రకాల సంబంధిత విషయాలు తెలుసుకొని ఇన్వెష్ట్ చేయాలి.

పైన ఉన్న పాయింట్స్ మనం చూసుకుంటే పుమా కంపెనీ చాలా మంచిగా ఉంది. ఇన్వెష్ట్ చేయాలి అనుకునే వాళ్ళు ఉంటే మంచి సమయం చూసి ఇన్వెష్ట్ చేయవచ్చు.






Reactions

Post a Comment

0 Comments